టీడీపీ నాయకుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

టీడీపీ నాయకుడి  కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

EG: జగ్గంపేట మండలం మర్రిపాక గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు కాపువరపు నూకా పతి ఇటీవలే రోడ్డు ప్రమాదంలో మరణించారు. బుధవారం నూకాపతి దశదినకర్మ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ హాజరై నూకా పతి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.