వడ్డీ వ్యాపారి వేధింపులు తట్టుకోలేక హమాలీ ఆత్మహత్య

KNR: జిల్లాలో వడ్డీ వ్యాపారి వేధింపులకు తట్టుకోలేక హమాలీ కార్మికుడు శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఐదేళ్ల కిందట రూ.4 లక్షలు అప్పు తీసుకున్న శ్రీనివాస్, రూ.15 లక్షలు చెల్లించినా ఇంకా రూ.27 లక్షలు చెల్లించాలని వడ్డీ వ్యాపారి నాగరాజు, అతని స్నేహితుడు రాజేందర్ ఒత్తిడి తెచ్చారు. భూమి రిజిస్ట్రేషన్ చేయాలని లేదా అప్పు తీర్చాలని వేధించినట్లు తెలిపారు.