తిరుపతి వెళ్లేవారికి రైల్వే తీపికబురు

తిరుపతి వెళ్లేవారికి రైల్వే తీపికబురు

SKLM: రైలు నంబరు 17440/39 శ్రీకాకుళం రోడ్ నుంచి తిరుపతి వారంతపు హాంసఫర్ ఎక్స్ ప్రెస్ రైలు నడుపుతున్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం పవన్ కుమార్ తెలిపారు. ఈ రైలు ఈనెల 13 నుంచి శ్రీకాకుళం రోడ్‌లో సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరుతుందని చెప్పారు. తిరుపతిలో ఈనెల19 నుంచి బయలుదేరగా, ప్రతి ఆదివారం అందుబాటులో ఉంటుందన్నారు. ఈ రైలుకు కొత్తవలసలో హాల్ట్ సౌకర్యం కల్పించారు.