మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు
BPT: బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు, సోమవారం రాత్రి చెరుకుపల్లి ఎస్సై అనిల్ కుమార్ తెనాలి రోడ్డులో వాహన తనిఖీలు నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడిపేవారికి భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. ప్రమాదాలను నివారించడానికి హెల్మెట్లు తప్పనిసరిగా ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని వాహనదారులకు అవగాహన కల్పించారు.