మినుములూరు పీహెచ్‌సీలో విచారణ
ASR: పాడేరు మండలం మినుములూరు పీహెచ్‌సీలో, సచివాలయం గ్రేడ్-3 ఏఎన్ఎంగా విధులు నిర్వహించిన ఉద్యోగినిపై మంగళవారం విచారణ చేపట్టామని డీఎంహెచ్‌వో డాక్టర్ డీ.కృష్ణమూర్తి నాయక్ తెలిపారు. పీహెచ్‌సీ వైద్యాధికారులు, సూపర్వైజర్లు, వైద్య సిబ్బంది, ఏఎన్ఎంలను వ్యక్తిగతంగా పిలిచి వివరాలు సేకరించామన్నారు. పూర్తి నివేదికను జిల్లా కలెక్టర్‌కు నివేదించడం జరుగుతుందని తెలిపారు.