ప్రమాద రహిత డ్రైవర్‌గా పులిపాక ప్రసాద్
PDPL: ధర్మారం మండలం కమ్మర్‌ఖాన్‌పేట గ్రామానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ పులిపాక ప్రసాద్‌ను కరీంనగర్ టూ డిపోలో శనివారం శాలువాతో ఘనంగా సన్మానించారు. రహదారి భద్రతకు కట్టుబడి ప్రమాదరహిత సేవలందించినందుకు గాను డిపో మేనేజర్ శ్రీనివాస్, సీఐ విజయలక్ష్మి, డీఐ బాలయ్యలు అభినందించారు. భవిష్యత్తులో కూడా సురక్షిత ప్రయాణ సేవలు అందించాలని అధికారులు సూచించారు.