హుబ్లీ ఎక్స్‌ప్రెస్ హాల్ట్‌కు గ్రీన్ సిగ్నల్
VKB: బషీరాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలోని ప్రయాణికుల చిరకాల వాంఛ నెరవేరింది. ప్రతిష్టాత్మకమైన హుబ్లీ ఎక్స్‌ప్రెస్ ఇకపై బషీరాబాద్ స్టేషన్‌లో నిలపడానికి రైల్వే శాఖ అనుమతులు మంజూరు చేసింది. చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి ఈ విషయాన్ని తెలిపారు. దీంతో బషీరాబాద్ పరిసర గ్రామాల ప్రజలు, వ్యాపారులకు రవాణా సౌకర్యం మరింత సులభతరం కానుంది.