గుంతలు పూడ్చిన ఆటో డ్రైవర్లు

PPM: బత్తిలి కొత్తూరు రోడ్డులో ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లుపై గుంతలు ఏర్పడ్డాయి. దీంతో మంగళవారం ఆటోడ్రైవర్లు, కళాసీలు సమిష్టిగా కంకరు, రాయిలుతో గుంతలను పూడ్చి చదును చేశారు. ఫ్రీ బస్సు వలన తమ ఆటోలకు ఆదాయం తగ్గిపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గుంతలు ఏర్పాడిన రోడ్లుపై కుదుపులకు ఆటోలో ప్రయాణించడానికి ప్రయాణికులు ఎవరూ ఆసక్తి చూపడం లేదని అన్నారు.