VIDEO: ఘనంగా యాదాద్రి క్షేత్రంలో చండీ హోమం
BHNG: యాదగిరిగుట్ట శ్రీవారి కొండపై వేంచేసి ఉన్న పర్వత వర్ధిని శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో శుక్రవారం చండీ హోమం ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు. వేదమంత్రాలతో ముందుగా గణపతి ఆరాధన చేసి హోమ ద్రవ్యాలు, పూర్ణాహుతితో చండీ హవనం నిర్వహించారు. ఈ హోమంలో పాల్గొన్న భక్తులకు వారికి అమ్మవారి ప్రసాదంగా అభిషేక లడ్డు, శేష వస్త్రం, కనుమలను అర్చకులు అందజేశారు.