'మార్చురీ ఘటనపై ఎమ్మెల్యే సమీక్ష సమావేశం'
MHBD: ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో మార్చురీ ఘటనపై శనివారం ఎమ్మెల్యే డా. భూక్యా మురళీ నాయక్, వైద్య సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. డ్యూటీలో సెల్‌ఫోన్ ఉపయోగించరాదని, అత్యవసరమైతే నార్మల్ ఫోన్లు మాత్రమే వాడాలని ఆదేశించారు. సమయపాలన లోపం, రోగుల పట్ల అలసత్వం ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. నిర్లక్ష్యం వహించిన ఇద్దరు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల పై వేటు వేశారు.