పులివెందుల సమస్యలపై కలెక్టర్‌కు వినతి

పులివెందుల సమస్యలపై కలెక్టర్‌కు వినతి

KDP: పులివెందుల టీడీపీ ఇంఛార్జ్ బీటెక్ రవి కడప కలెక్టర్ శ్రీధర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు పులివెందుల నియోజకవర్గ సమస్యలు, మార్కెట్ యార్డుకు గేటు నిర్మాణం, వాటర్ ప్లాంట్ ఏర్పాటు, e-NAM అమలుపై వినతి పత్రం అందజేశారు. అయితే ఈ వినతిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించి సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.