శిర్పిలో కొబ్బరిచెట్టుపై పిడుగు
ATP: బెలుగుప్ప మండలం శిర్పి గ్రామంలో సోమవారం రాత్రి పిడుగుపడి కొబ్బరిచెట్టు తగలబడింది. అకాల వర్షం కురుస్తున్న సమయంలో పెద్ద శబ్దంతో పిడుగు పడటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తక్షణం అప్రమత్తమైన నివాసితులు ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. జిల్లాలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.