అనారోగ్యంతో పదవ తరగతి విద్యార్థిని మృతి

అనారోగ్యంతో పదవ తరగతి విద్యార్థిని మృతి

NZB: డిచ్‌పల్లి మండలం మెంట్రాజ్పల్లి గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థిని నవ్య (14) అనారోగ్యం కారణంగా సోమవారం మృతి చెందింది. దీంతో గ్రామస్థులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనయ్యారు. కాగా, నవ్య 2 నెలలుగా అనారోగ్యం బారిన పడగా వివిధ ఆస్పత్రుల్లో చికిత్స అందించారు. ఈ క్రమంలో నిన్న రాత్రి ప్రాణాలు కోల్పోయింది. బాలిక మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.