శ్రీవారి లడ్డూ కల్తీపై జనసేన తిరుపతిలో భారీ నిరసన ర్యాలీ
TPT: కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి పవిత్ర లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసి, కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసిన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ తిరుపతిలో జనసేన పార్టీ భారీ నిరసన కార్యక్రమం చేపట్టింది. స్థానిక ఇస్కాన్ టెంపుల్ నుంచి అలిపిరి వరకు ఈ ప్రదర్శన కొనసాగింది. ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది.