కిరాణ దుకాణంలో చోరీ

కిరాణ దుకాణంలో చోరీ

JGL: తాళ్లధర్మారంలోని కిరాణ దుకాణంలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డట్లు ఎస్సై రాజు శనివారం తెలిపారు. గ్రామానికి చెందిన నల్ల మహిపాల్ రెడ్డి దుకాణం తాళాలు పగులగొట్టిన దొంగలు రూ. 40 వేల నగదు, అర తులం బంగారాన్ని ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు వివరించారు.