అంబులెన్స్‌లో ప్రసవం.. తల్లీ బిడ్డ క్షేమం
NZB: భీమ్ గల్ మండలంలో ఓ మహిళ శనివారం తెల్లవారుజామున అంబులెన్స్‌లో ప్రసవించింది. ఎంజే తండాకు చెందిన సంధ్య రెండో కాన్పు నిమిత్తం ఆర్మూర్ ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో పురిటినొప్పులు ఎక్కువకావడంతో అంబులెన్స్ సిబ్బంది పురుడు పోశారు. దీంతో ఆమె ఆడబిడ్డకు జన్మించింది. తల్లీబిడ్డను క్షేమంగా ఆర్మూర్ ఏరియా ఆసుపత్రి తరలించారు.