కడప ట్రాఫిక్ సీఐగా సురేష్ రెడ్డి బాధ్యతలు
కడప ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను నూతన సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా సురేష్ రెడ్డి నియమితులయ్యారు. గురువారం ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. స్టేషన్ సిబ్బంది ఆయనకు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. ఆయన మాట్లాడుతూ.. ట్రాఫిక్ సమస్యల పరిష్కారం, రోడ్డు భద్రత, ప్రజల్లో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంపు కోసం పనిచేస్తానని అన్నారు.