మిలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎంపీ

NLR: మిలాద్-ఉన్-నబీ సందర్భంగా మాజీ ఎంపీ ఆదాలను ముస్లిం సోదరులు నెల్లూరులోని ఆయన కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ఆయన మిలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. శత్రువులను సైతం క్షమించాలని, ప్రతి ఒక్కరూ ప్రేమ, కరుణ, సహనం కలిగి ఉండాలని మహ్మద్ ప్రవక్త బోధించిన బోధనలు సదా అనుసరణీయమన్నారు.