పేద యువకుడికి అండగా MLA రాజగోపాల్ రెడ్డి

పేద యువకుడికి అండగా  MLA రాజగోపాల్ రెడ్డి

NLG: కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చౌటుప్పల్ మండలం చిన్న కొండూరుకు చెందిన నెల్లి గణేష్‌కు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అండగా నిలిచారు. ఆపదలో ఉన్నవారికి అండగా ఉంటాననే మాటను నిలబెట్టుకుంటూ.. తన సొంత ఖర్చు రూ. 12.50 లక్షలతో గణేష్‌కు ప్రైవేట్ ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి చికిత్స చేయించారు. ఎమ్మెల్యేను పలువురు జిల్లా వాసులు అభినందిస్తున్నారు.