నగరిలో తుపాన్ బాధితులకు కాపు సంఘం సాయం
CTR: మొంథా తుఫాన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులకు నగరి కాపు సంఘం వారు ఆదరాభిమానాలు అందించింది. ఇందులో భాగంగా సంఘ అధ్యక్షుడు బాబు నాయకత్వంలో కీళ్లపట్టు ఆంజనేయస్వామి గుట్ట, టీఆర్ కండ్రిగ ఇందిరమ్మ లేఔట్ ప్రాంతాల్లో బాధితులకు బియ్యం, కూరగాయలు మరియు అవసరమైన నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. తమ కష్టాలను వివరించిన బాధితులకు సంఘ ప్రతినిధులు ఆత్మస్థైర్యం నింపారు.