నిజాంసాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తే అవకాశం

KMR: నిజాంసాగర్ ప్రాజెక్టు వరద గేట్లను గురువారం ఏ సమయంలో నైనా ఎత్తే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టులోకి ఎగువ భాగాల నుంచి వరద నీరు రావడంతో ప్రాజెక్టు వరద గేట్లను ఎత్తి దిగువన ఉన్న మంజీరా నదిలోకి విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. నది పరివాహక ప్రాంతం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పశువులకాపరులు నదిలోకి దిగరాదని సూచించారు.