'ఐకమత్యంగా పనిచేసి పార్టీ గెలుపుకు కృషి చేయాలి'

'ఐకమత్యంగా పనిచేసి పార్టీ గెలుపుకు కృషి చేయాలి'

MLG: స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. ఏటూరునాగారంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. కార్యకర్తలు ఐకమత్యంగా పనిచేసి పార్టీ గెలుపునకు కృషి చేయాలన్నారు. ప్రజాసేవ కోసం అనుక్షణం పనిచేసే అభ్యర్థులకే టికెట్ ఇస్తామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డికి ఈ గెలుపును కానుకగా ఇవ్వాలని ఆమె కోరారు