శారద మెటల్స్ అల్లాయ్ ఆధ్యర్యంలో ఉచిత వైద్య శిబిరం
VZM: కొత్తవలసలోని కంటకాపల్లి వద్ద ఉన్న శారద మెటల్స్ అల్లాయ్ లిమిటెడ్ ఆధ్యర్యంలో బుధవారం స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. మొత్తం 320 మందిని ఆరోగ్య పరీక్షలు నిర్వహించగా, వారిలో దీర్ఘకాలిక రోగులతో ఇబ్బందులు పడుతున్న వారికి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మానవవనరుల విభాగం ప్రభాత్ మోహన్, సన్యాసిరావు, శంకరరావు పాల్గొన్నారు.