BRSV నాయకులను ముందస్తు అరెస్ట్
MNCL: ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ BRSV రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో BRSV జిల్లా అధ్యక్షులు బడికల శ్రావణ్‌ను పోలీసులు మంగళవారం ముందస్తు అరెస్ట్ చేశారు. అరెస్టు చేసిన వారిని రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ తరలించారు. అక్రమ అరెస్ట్‌లతో విద్యార్థి ఉద్యమాలను ఆపలేరని అన్నారు.