'సంక్రాంతి పండుగ ప్రశాంతంగా జరుపుకోవాలి'

SKLM: సంక్రాంతి పండుగ సాంప్రదాయ పద్ధతిలో ప్రశాంతంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ శ్రీ కెవి మహేశ్వర రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఎవరైనా పేకాట, కోడి పందాలు, డొక్కు ఆట వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని శాంతి భద్రతలు పాటించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం అని పేర్కొన్నారు.