VIDEO: భక్తి సాగరమైన రాయికోడ్... కేరళ వాయిద్యాలతో రథోత్సవం
SRD: రాయికోడ్ మండల కేంద్రంలో వీరభద్రుడి రథోత్సవం మంగళవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. స్థానిక భద్రకాళి వీరభద్రేశ్వర ఆలయం నుంచి గ్రామస్తులు రథాన్ని లాగుతూ బసవేశ్వర ఆలయం వరకు తీసుకెళ్లారు. అయితే వీరభద్రుడి మహా రథం కేరళ వాయిద్యాల నడుమ శోభయాత్ర కొనసాగింది. వేలాది సంఖ్యలో భక్తులు తరలి రావడంతో రాయికోడ్ గ్రామమంతా భక్తజన సందోహంతో భక్తి సాగరమైంది.