గడ్డివాము దగ్ధం

NDL: డోన్ మండలం ఎర్రగుంట గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే బాధితుడు తిమ్మయ్య తెలిపిన వివరాల ప్రకారం.. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు తన గడ్డివాముకు నిప్పు పెట్టారని పేర్కొన్నాడు. ఈ ప్రమాదంలో గడ్డివాము పూర్తిగా దగ్దమైందని అన్నాడు. సుమారు 70 వేల రూపాయలు నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం తనను ఆదుకోవాలని కోరాడు.