ఐటీఐ, ఏటీసీలో ప్రవేశాలకు గడువు పెంపు

ADB: జిల్లాలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల, ఏటీసీ కేంద్రాల్లో ప్రవేశాల గడువును ఈనెల 28 వరకు పొడిగించినట్లు ప్రిన్సిపాల్ పీ.శ్రీనివాస్ తెలిపారు. ఐటీఐలో 136 సీట్లకు 114 సీట్లు భర్తీ కాగా, 22 సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. అలాగే ఏటీసీలో 172 సీట్లకు గాను 14 సీట్లు మాత్రమే ఖాళీగా ఉన్నాయని వివరించారు. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.