'అనుమానాస్పదస్థితిలో మహిళ మృతి'

MBNR: అనుమానాదస్పద స్థితిలో ఓ మహిళ మృతి చెందిన ఘటన బాలానగర్ మండలంలో జరిగింది. మండల కేంద్రానికి చెందిన లత (34) ఈనెల 14న ఇంటి నుంచి వెళ్ళిపోయింది. కుటుంబ సభ్యులు వెతికిన ఆచూకీ లభించలేదు. ఆదివారం పెద్దయపల్లి గ్రామ శివారులో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.