'జన్‌ ధన్‌ ఖాతాల్లో రూ.2.75 లక్షల కోట్లు'

'జన్‌ ధన్‌ ఖాతాల్లో రూ.2.75 లక్షల కోట్లు'

దేశవ్యాప్తంగా జన్‌ ధన్‌ ఖాతాల్లో రూ.2.75 లక్షల కోట్లు ఉన్నాయని ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి ఎం నాగరాజు తెలిపారు. ఈ లెక్కన ఒక్కో ఖాతాలో సగటున రూ.4,815లు ఉన్నట్లు అవుతుందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.3.67 లక్షల కోట్లు ప్రత్యక్ష నగదు బదిలీ పథకం ద్వారా లబ్ధిదారులకు బదిలీ చేసినట్లు చెప్పారు. మొత్తం ఖాతాల్లో 50% మహిళలకు చెందినవిగా వెల్లడించారు.