'దాడులకు బీజేపీ మద్దతు సిగ్గుచేటు'

KMM: పాలస్తీనాపై ఇజ్రాయిల్ చేస్తున్న దాడులకు బీజేపీ మద్దతు ఇవ్వడం సిగ్గుచేటని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు అన్నారు. సోమవారం ఖమ్మంలోని గిరిప్రసాద్ భవనంలో వారు మాట్లాడుతూ... గాజాపై జరుగుతున్న మారణకాండని ప్రపంచం మొత్తం వ్యతిరేకిస్తుందని తెలిపారు. లక్షలాది మంది ప్రజలు ఈ దాడులను నిరసిస్తూ నిరసన ప్రదర్శనలు చేస్తున్నారని పేర్కొన్నారు.