ఇరాన్‌లో 9 వేల మంది భారతీయులు ఉన్నారు: కేంద్రం

ఇరాన్‌లో 9 వేల మంది భారతీయులు ఉన్నారు: కేంద్రం

ప్రస్తుతం ఇరాన్‌లో తొమ్మిది వేల మంది భారతీయులు ఉన్నారని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణధీర్ వెల్లడించారు. వీరిలో విద్యార్థులు, నౌకా సిబ్బంది, వ్యాపార వేత్తలు, యాత్రికులు ఉన్నట్లు తెలిపారు. ఘర్షణ మొదలైన వెంటనే విద్యార్థులు సహా అనేక మంది భారతీయులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చెప్పారు. స్వదేశానికి తిరిగి రావాలనుకునే వారికి సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు