తడిచిన ధాన్యాన్ని అరమెట్టుకుంటున్న వరి రైతులు
కోనసీమ: ఇటీవల దిత్వా తుఫాను భారీ వర్షాల కారణంగా నీట మునిగిన వరి చేలు కోయడం బుధవారం రైతులు ప్రారంభించారు. ముమ్మిడివరం మండలం అనాతవరంలో రైతులు తడిచిన ధాన్యాన్ని ప్రధాన రహదారులపై ఆరబెట్టే పనిలో పడ్డారు. అధిక వర్షాల వలన కొంత ధాన్యం కుళ్లిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆరబెట్టిన ధాన్యాన్ని మిల్లులకు పంపుతామని తెలిపారు.