కూతురు ఇంటికి వెళ్తూ వృద్ధుడు అదృశ్యం

కూతురు ఇంటికి వెళ్తూ వృద్ధుడు అదృశ్యం

MBNR: బాలానగర్ మండలం బోడ జానంపేట గ్రామానికి చెందిన సంపంగి పుల్లయ్య (85) సోమవారం అదృశ్యమయ్యారు. సాయంత్రం కూతురు ఇంటికి వెళ్తున్నట్లు ఆయన ఇంట్లో చెప్పి షాద్‌నగర్‌కు ఆటోలో వెళ్లాడు. అయితే అతను తమ ఇంటికి రానట్లు కూతురు తెలిపింది. దీంతో కుటుంబీకులు బంధువుల వద్ద వెతికినా ఆచూకీ దొరకలేదు. మంగళవారం కుమారుడు ఆంజనేయులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.