మూడవ ఆడ బిడ్డకు చెక్కు అందజేత

మూడవ ఆడ బిడ్డకు చెక్కు అందజేత

రణస్థలం మండలంలోని పాతర్లపల్లి గ్రామానికి చెందిన పొన్నాడ వెంకటలక్ష్మి మూడవ సంతానంగా ఆడబిడ్డకు జన్మనివ్వడంతో రూ. 50వేల చెక్కును అందజేశారు. ఈ మేరకు ఆదివారం ఉదయం ఆమె నివాసం వద్ద విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావులు వెంకటలక్ష్మికి చెక్కును పంపిణీ చేసి ఘనంగా ప్రారంభించారు.