చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

BHPL: నారాయణపూర్ (V) చెందిన శంకర్ (32) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. SI సుధాకర్ వివరాల ప్రకారం.. భార్య లావణ్య, భర్త శంకర్ మధ్య తరచూ గొడవలు తలెత్తాయి. దీంతో ఈనెల 17వ తేదీన శంకర్ కొత్త ఇంటికి వెళ్తానని చెప్పి వెళ్లి.. అక్కడే పురుగుల మందు సేవించి ఆత్మహత్యయత్నం చేశాడు. గమనించిన గ్రామస్తులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందాడు.