జిల్లాలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం

జిల్లాలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం

విశాఖలోని 53వ వార్డు వైసీపీ కార్యాలయంలో సోమవారం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. వార్డు కార్పొరేటర్ భర్కత్ అలీ, వార్డు అధ్యక్షుడు గుజ్జు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జిల్లా అధ్యక్షులు, విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె.కె రాజు పాల్గొన్నారు.