ప్రియుడి పాదాలను ముద్దాడిన పాప్ సింగర్
హాలీవుడ్ సింగర్ సెలీనా గోమెజ్ తన ప్రియుడు బెన్నీ బ్లాంకోపై చూపిస్తున్న ప్రేమ నెట్టింట చర్చనీయాంశమైంది. ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో సెలీనా తన ప్రియుడి పాదాలను ముద్దాడుతూ కనిపించింది. అయితే, ఆ పాదాలు మురికిగా ఉండటంతో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు దీన్ని నిజమైన ప్రేమ అని కొనియాడుతుంటే, మరికొందరు మాత్రం ఇది వింతగా, అసహ్యంగా ఉందంటూ ట్రోల్ చేస్తున్నారు.