వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన ఎస్పీ

వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన ఎస్పీ

ELR: కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో గోదావరి వరద ప్రభావిత ప్రాంతాలను ఎస్పీ శివ ప్రతాప్ కిషోర్ బుధవారం సిబ్బందితో కలిసి పరిశీలించారు. పునరావాస కేంద్రాలు, రోడ్లపై ప్రవహిస్తున్న వాగులను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రజల భద్రతకు అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితులపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు.