మాది 'ఫైర్ & ఫైర్' కాంబినేషన్: అభిషేక్
శుభ్‌మన్ గిల్‌తో కలిసి ఓపెనింగ్ బ్యాటింగ్ చేయడంపై అభిషేక్ శర్మ ఆసక్తికరంగా స్పందించాడు. తమది 'ఐస్ అండ్ ఫైర్' కాంబినేషన్ కాదని.. 'ఫైర్ అండ్ ఫైర్' కాంబినేషన్ అని అభివర్ణించాడు. గిల్ కూడా చాలా వేగంగా బ్యాటింగ్ చేయగలడని పేర్కొన్నాడు. అండర్-12 రోజుల నుంచే తాము కలిసి ఆడుతున్నామని చెప్పాడు. అందుకే తమ ఇద్దరి మధ్య మంచి సమన్వయం ఉంటుందని వ్యాఖ్యానించాడు.