ఈనెల 20న బడ్జెట్.. ఇకనైనా పూర్తి చేస్తారా..!

ఈనెల 20న బడ్జెట్.. ఇకనైనా పూర్తి చేస్తారా..!

BHNG: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఉమ్మడి జిల్లా ప్రజలు భారీ ఆశలు పెట్టుకున్నారు. ప్రధానంగా SLBC సొరంగం పనులు, డిండి ఎత్తిపోతల పథకం పూర్తికి వెయ్యి కోట్ల నిధుల కేటాయింపుపై రైతులు ఎదురుచూస్తున్నారు. అలాగే పెండింగ్‌లో ఉన్న బ్రాహ్మణ వెల్లంల, ఉదయసముద్రం ప్రాజెక్టులతో పాటు పట్టణాల్లోని మిని ట్యాంక్ బండ్ల నిర్మాణాలకు నిధులు వస్తాయని ఆశిస్తున్నారు.