ప్రతిభ కనబరిచిన తెనాలి విద్యార్థులు

ప్రతిభ కనబరిచిన తెనాలి విద్యార్థులు

GNTR: తెనాలికి చెందిన విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయి అబాకస్ పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. పట్టణంలోని మాస్టర్ బ్రెయిన్ సంస్థకు చెందిన విద్యార్థులు ఈనెల 13న గుంటూరులో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలలో, 16 నుంచి 20వ తేదీ వరకు హైదరాబాద్‌లో జరిగిన జాతీయస్థాయి పోటీలలో పాల్గొని ప్రతిభ చాటారు. వారిని పలువురు శుక్రవారం ప్రత్యేకంగా అభినందించారు.