ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే
CTR: చిత్తూరు రూరల్ మండలం పెరుమాళ్ళ కండిగ గ్రామంలో నూతనంగా నిర్మించనున్న శ్రీ ద్రౌపదీదేవి సమేత ధర్మరాజుల స్వామి ఆలయానికి సోమవారం భూమి పూజ నిర్వహించారు. ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆలయ నిర్మాణానికి శాస్త్రోక్తంగా భూమి పూజ చేసి పునాది రాయి వేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు చంద్రప్రకాష్, విజయేంద్ర బాబు పాల్గొన్నారు.