జిల్లాకు రేపు దేవదాయశాఖ మంత్రి రాక

CTR: కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఈ నెల 27వ తేదీన విచ్చేయనున్నారు. ఉదయం 8 గంటలకు తిరుపతి జిల్లా కేంద్రం నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి కాణిపాకానికి చేరుకోనున్నారు. అనంతరం వరసిద్ధి వినాయక స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నట్టు ఆయన పేర్కొన్నారు.