గుండెపోటుతో కాంగ్రెస్ నేత మృతి

గుండెపోటుతో కాంగ్రెస్ నేత మృతి

CTR: ఏపీ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర మాజీ అధికార ప్రతినిధి మారుసాని గోవర్ధన్ రెడ్డి ఆకస్మికంగా మృతిచెందారు. గురువారం ఉదయం 3 గంటలకు ఛాతీ నొప్పితో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబసభ్యులు అత్యవసర చికిత్స నిమిత్తం కార్వేటినగరం ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఆయన స్వగ్రామం RKVBపేటలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.