మొంథా తుఫాన్ లో 40,000 ఎకరాల పంట నష్టం

మొంథా తుఫాన్ లో 40,000 ఎకరాల పంట నష్టం

ADB: మొంథా తుపాను ప్రభావంతో ఆదిలాబాద్ జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇప్పటికే భారీ వర్షాలతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 40,000 ఎకరాలకు పైగా పంటలు దెబ్బతిన్నాయి. పంటలు చేతికొచ్చే సమయంలో వానలు పడుతుండడంతో పత్తి మురిగిపోతుందని, వరి, సోయా, మొక్కజొన్న ధాన్యం తడిసి మొలకలు వస్తున్నాయని అన్నదాతలు వాపోతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని ప్రజలు కోరారు.