శాకంబరీ అమ్మవారి అలంకరణలో శ్రీ పైడితల్లమ్మ

VZM : జిల్లా ప్రజలకు ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే తల్లి శ్రీ పైడితల్లమ్మకు చదురుగుడిలో ప్రత్యేక పూజలు చేశారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆలయ అర్చకులు వివిధ రకాల కాయగూరలతో శాకంబరీ అమ్మవారిగా అలంకరించారు. ఈ సందర్భంగా వేకువజాము నుంచి పంచామృతాభిషేకాలు, పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.