భార్యను కత్తితో పొడిచిన భర్త..!

భార్యను కత్తితో పొడిచిన భర్త..!

MBNR: జడ్చర్లలోని గౌరీశంకర్ కాలనీలో శుక్రవారం రాత్రి మల్లేష్, లలిత దంపతుల మధ్య తగాదం తారస్థాయికి చేరింది. మాట మాట పెరగడంతో భర్త మల్లేష్, క్షణికావేశంలో ఇంట్లో ఉన్న కత్తితో భార్య లలితను పొడిచాడు. ఆమె కేకలు వేయడంతో మల్లేష్ అక్కడి నుంచి పారిపోయాడు. గాయపడిన లలితను స్థానికులు 108 అంబులెన్సులో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.