'వినుకొండలో డ్రైనేజీ గుంతలు పూడ్చాలి'

'వినుకొండలో డ్రైనేజీ గుంతలు పూడ్చాలి'

PLD: వినుకొండ ముండ్లమూరు సెంటర్లో డ్రైనేజీ కోసం తీసిన గుంతలను వెంటనే పూడ్చాలని మాల మహానాడు కోరింది. ఈ మేరకు బుధవారం మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం ఇచ్చారు. అసంపూర్తి పనులతో ట్రాఫిక్ ఇబ్బందులు వస్తున్నాయన్నారు. పట్టణంలో ఆవుల బెడదను అరికట్టాలని, డిసెంబర్ 6న అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా విగ్రహాలను శుభ్రం చేయాలని విజ్ఞప్తి చేశారు.