అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లు ఆమోదంపై సీఎంకు పాలాభిషేకం

అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లు ఆమోదంపై సీఎంకు పాలాభిషేకం

KNR: తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి 'అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లు'కు ఆమోదం తెలపడంపై హుజూరాబాద్ న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని స్వాగతిస్తూ, TPCC లీగల్ సెల్ జాయింట్ కన్వీనర్ జీడి రవితేజ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక కోర్టులో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ బిల్లును ఆమోదించడంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.